పబ్లిక్ ప్లేసెస్‌లో ఛార్జింగ్ పెడితే బ్యాంక్ అకౌంట్స్ ఖాళీ చేసే జ్యుస్ జాకింగ్ 

మీ చేతిలో ఎంత ఖరీదైన ఫోన్ అయినా ఉండొచ్చు. మీరు అత్యంత లేటెస్ట్ ల్యాప్ టాప్ అయినా వాడుతుండొచ్చు. కానీ ఛార్జింగ్ లేకపోతే వేస్టే. అందుకే చాలా మంది ఛార్జర్ వెంట తీసుకెళతారు. ఒకవేళ ఛార్జర్ తీసుకెళ్లకపోయినా ఇబ్బంది లేదు. ఇప్పుడు పెద్ద పెద్ద మాల్స్‌లో, షాపింగ్ కాంప్లెక్స్‌ల్లో, ప‌బ్లిక్‌తో ఎక్కువ‌గా ర‌ద్దీగా ఉండే  ప్లేస్‌ల్లో ఒక ఛార్జింగ్ డాక్ పెట్టి దానికి యూఎస్‌బీ కేబుల్ త‌గిలించి ఉంచుతున్నారు. దీంతో మనకు చార్జర్ తీసుకెళ్లలేదు అన్న బెంగ ఉండదు. అయితే ఇలాంటి చార్జింగ్ ఈ పాయింట్ దగ్గర మీ ఫోన్ ఛార్జ్ చేసుకునేట‌ప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ మొత్తం ఖాళీ అయ్యే ప్ర‌మాదం ఉందంటున్నారు సైబ‌ర్ నిపుణులు. దీనికి వాళ్లు జ్యూస్ జాకింగ్ అనే పేరు కూడా పెట్టేశారు. 

ఇంత‌కీ ఏంటీ జ్యూస్ జాకింగ్‌?
తెలియని చోట్ల ఛార్జింగ్ పెట్టుకుంటే ప్రమాదం పొంచి ఉన్నట్టే. ఎందుకంటే ఇలాంటి చోట్ల  డేటా కేబుల్లో మాల్వేర్ ముందే ఇన్‌స్టాల్ చేసి ఉంచే సైబర్ నేరగాళ్లు ఉన్నారు. ఇది తెలియక మనం  ఆ డేటా కేబుల్‌తో మ‌న డివైజ్‌ను ఛార్జ్ చేసుకుంటే దాన్ని ఆ మాల్వేర్ హ్యాక్ చేస్తుంది. దానిలో ఉన్న డేటాను యాక్సెస్ చేస్తుంది.  మన పాస్‌వ‌ర్డ్‌లు తెలుసుకుని మ‌న బ్యాంక్ అకౌంట్ల‌ను కూడా ఖాళీ చేస్తార‌ని, దీన్నే జ్యూస్ జాకింగ్ అంటామ‌ని కార్నెగీ మెలన్ యూనివర్సిటీలో సైబర్ సెక్యురిటీ రీసెర్చ్ చేస్తున్న ప్రొఫెసర్ వ్యాస్ శేఖర్ హెచ్చరిస్తున్నారు. 

ఎలా సాధ్యం?
సైబ‌ర్ నేర‌గాళ్లు ఇప్పుడు కొన్నిచోట్ల ఏటీఎంలో స్కిమ్మర్స్ పెడుతున్నారు. అవి మన కార్డు నంబర్, డిటెయిల్స్‌, పిన్ నంబర్ అన్నీ రీడ్ చేస్తాయి. దీంతో వాళ్లు దొంగ కార్డులు త‌యారుచేసి ఆ పిన్ నెంబ‌ర్‌తో మన అకౌంట్‌లో డ‌బ్బులు డ్రా చేసేస్తారు. అలాగే 
ఇలా పబ్లిక్ ప్లేస్‌ల్లో ఉంచిన‌ యూఎస్‌బీ డ్రైవ్ లేదా ఛార్జింగ్ డాక్‌లో మాల్వేర్ ఇన్‌స్టాల్ చేస్తార‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. 

ఎలా నిరోధించాలి?
* ఇంట్లోనో, ఆఫీస్‌లో ఉండ‌గానే ఫుల్ ఛార్జింగ్ పెట్టుకోండి.

* మీరు బ‌య‌టికెళ్లిన‌ప్పుడు ఛార్జింగ్ అయిపోతే వాడుకోవ‌డానికి వీలుగా ప‌వ‌ర్ బ్యాంక్‌ను వెంట తీసుకెళ్లండి.

* లేదంటే మీ సొంత ఛార్జ‌ర్‌, కేబుల్ తీసుకెళ్లి వీలైన చోట దానితో ఛార్జింగ్ పెట్టుకోండి. అంతే త‌ప్ప ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఇలా ప‌బ్లిక్‌
ప్లేసెస్‌లో మ‌న‌వి కాని వాటితో ఛార్జింగ్ చేసుకోకండి. 

పబ్లిక్ ప్లేసెస్‌లో ఛార్జింగ్ జ్యుస్ జాకింగ్ సైబ‌ర్ క్రైమ్‌ Charging in public places Juice jaking Cyber crime